కోర్టులో కన్నీరు పెట్టిన స్వాతి మలీవాల్
- కోర్టులో కళ్ళు తిరిగిపదిపోయిన మహిళా న్యాయవాది
- ఎంపీపై వేధింపుల కేసు విచారణలో నాటకీయ పరిణామాలు
- నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో బిభవ్ ను కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు
ఈ నెల 18న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందని ఎంపీ స్వాతి మలీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణరహితంగా దాడి చేశారని, చెంపపై ఏడు ఎనిమిదిసార్లు కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కడుపులో తన్నడంతో పాటు సున్నిత భాగాలపైనా కొట్టాడని చెప్పారు. దీంతో పోలీసులు ఈ నెల 18న బిభవ్ కుమార్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు నాలుగు రోజుల కస్టడీ విధించింది. కాగా, ఈ ఘటనపై స్వాతి మలీవాల్ మాట్లాడుతూ.. తనపై ఇలా దాడి జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదని చెప్పారు. మహిళా కమిషన్ లో విధులు నిర్వహించినపుడు బాధిత మహిళలకు ఏదేమైనా సరే న్యాయం కోసం పట్టువదలకుండా పోరాడాలని సలహా ఇచ్చేదానినని గుర్తుచేసుకున్నారు. తనపై దాడి విషయంలోనూ ఇదే పాటిస్తున్నానని, తన కెరీర్, పదవి ఏమైపోయినా పట్టించుకోబోనని తేల్చిచెప్పారు.