ఇది నేనేనంటే నమ్మలేకపోతున్నా.. జానీ సినిమా వీడియో క్లిప్ షేర్ చేసిన రేణు దేశాయ్
- తన బర్త్ డేకు కొడుకు అకీరా ఇచ్చిన గిఫ్ట్ అంటూ వ్యాఖ్య
- పవన్ పై ప్రేమను ఇలా చూపించిందంటున్న ఫ్యాన్స్
- సోషల్ మీడియాలో వైరల్ గా రేణు దేశాయ్ ఇన్ స్టా పోస్ట్
బద్రి సినిమాలో జంటగా నటించిన పవన్, రేణు దేశాయ్ ఆ తర్వాత జానీ సినిమాలోనూ జంటగా కనిపించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు అకీరా, ఆద్యలు జన్మించారు. అయితే, మనస్పర్థల కారణంగా పవన్, రేణు విడాకులు తీసుకున్నారు. ఆపై పవన్ మరో వివాహం చేసుకోగా.. రేణు మాత్రం తన పిల్లల పెంపకంపై దృష్టి పెట్టింది. పిల్లలు పెద్దవారు కావడంతో ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమాతో రేణు దేశాయ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.