'మోదీ మరోసారి సీఎం కావాలి' అంటూ నోరుజారిన నితీశ్ కుమార్
- బీజేపీ కూటమికి 400 సీట్లకు పైగా రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడి
- మోదీ మళ్లీ సీఎం అయితేనే దేశం, బీహార్ అభివృద్ది చెందుతాయన్న నితీశ్
- పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నోరు జారిన బీహార్ సీఎం
ఇటీవల మరో సందర్భంలోనూ నితీశ్ ఇలాగే నోరుజారారు. కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కు ఓటేసి గెలిపించాలని నితీశ్ ఇటీవల ప్రజలను కోరారు. 2020లోనే రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరిచిన నితీశ్.. ఈ ఎన్నికల్లో రాం విలాస్ పాశ్వాన్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నితీశ్ కుమార్ వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు.. దీంతో నితీశ్ కు వయసు అయిపోయిందని, ఇక ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన టైమొచ్చిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.