Actor Navdeep: రేవ్ పార్టీ అంటే ఏంటో వివరించిన సినీ నటుడు నవదీప్

Navdeep talks about bengaluru rave party
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీకి తాను హాజరు అయినట్టు ఫేక్ వార్తలు రాక కొందరు నిరుత్సాహపడి ఉంటారని సినీ నటుడు నవదీప్ అన్నారు. ‘ ఏంటన్నా.. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్ లో కనిపించడంలేదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు. 

నవదీప్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘లవ్ మౌళి’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురైంది. ‘ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అని విలేకరి ప్రస్తావించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. రేవ్ పార్టీ అంటే రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు.
Go Back to Shorts
Actor Navdeep
Bengaluru Rave Party
Tollywood

More Telugu News