స్టంప్స్‌పై ప్రతాపం.. రాజస్థాన్ స్టార్ బ్యాటర్ హెట్మెయిర్‌కు జరిమానా
- అభిషేక్ శర్మ బౌలింగ్‌లో హెట్మెయిర్ బౌల్డ్
- ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక స్టంప్స్ విరగ్గొట్టే ప్రయత్నం
- తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్
- మ్యాచ్ ఫీజులో పదిశాతం కోత
హెట్మెయిర్ ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినట్టు పేర్కొన్నప్పటికీ అది ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే, అవుట్‌పై అతిగా ప్రతిస్పందించడం వల్లే అయి ఉంటుందని తెలిసింది. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన హెట్మెయిర్ ఫ్రస్ట్రేషన్‌తో స్టంప్స్‌పై ప్రతాపం చూపించాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించినట్టు తెలిసింది.