పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డ రేణు దేశాయ్

Renu Desai Fires on Pawan Kalyan Fans
  • ప్రతిసారి ఆయనతో పోల్చడమేంటని ఆగ్రహం
  • ఎంతోమందిని బ్లాక్ చేశా.. అయినా ఈ కామెంట్స్ ఆగడంలేదని ఆవేదన
  • తాజాగా రేణు దేశాయ్ పెట్టిన వీడియోకు పవన్ ఫ్యాన్స్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పిల్లలను పెంచుకుంటూ స్వతంత్రంగా జీవిస్తున్నారు. చిన్నతనం నుంచే యానిమల్ లవర్ అయిన రేణు.. చాలా జంతువులను ప్రేమగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన పెంపుడు జంతువులకు సంబంధించిన ఓ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. దీనికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెట్టిన కామెంట్ తో రేణు దేశాయ్ తీవ్రంగా మండిపడ్డారు. మేం విడిపోయి ఏళ్లు గడిచినా ఇంకా ప్రతిదానికీ ఆయనతో పోల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తో తనకెలాంటి సమస్య లేదని, ఆయన ఫ్యాన్స్ ప్రతిసారీ తన సోషల్ మీడియా ఖాతాలపైకి వచ్చి కామెంట్స్ పెట్టడం చిరాకు తెప్పిస్తోందని ఓ పోస్ట్ పెట్టారు. ఇలాంటి కామెంట్లు పెట్టిన ఎంతోమందిని బ్లాక్ చేసినా కూడా తనకీ బెడద తప్పడంలేదని వాపోయింది.

రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోకు.. ‘మీది కూడా పవన్ కల్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీంతో ఆ నెటిజన్ పై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. ‘నా పోస్టులను ప్రతిసారి నా ఎక్స్ హస్బెండ్ తో ఎందుకు కంపేర్ చేస్తారు? పదేళ్ల వయసు నుంచి నాకు జంతువులంటే ప్రేమ. నా ఎక్స్ హస్బెండ్ నాలాగా యానిమల్ లవర్ కాదు’ అంటూ జవాబిచ్చారు. ఈ కామెంట్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తూ.. ఇలాంటి కామెంట్స్ బాధను, ఆవేదనను, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని రాసుకొచ్చారు.
Go Back to Shorts
Renu Desai
Pawan Kalyan
Instagram
animal lover
Pawan Fans
insta comments

More Telugu News