నోటాకు ఓటు వేయాలంటూ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం

Congress campaigns for NOTA in Indore
  • ఇండోర్ లోక్ సభ స్థానంలో ఆసక్తికర అంశం
  • నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
  • ఆ తర్వాత బీజేపీలో చేరిన కాంగ్రెస్ అభ్యర్థి 
  • బీజేపీకి బుద్ధి చెప్పడానికి నోటాకు ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ప్రచారం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్ సభ స్థానంలో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా బీజేపీయే గెలుస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ నుంచి శంకర్ లల్వానీ, కాంగ్రెస్ నుంచి అక్షయ్ బామ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు. ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ నోటాకు ఓటు వేయాలని జోరుగా ప్రచారం నిర్వహించింది.

ఇక్కడ మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ అంశంపై కోర్టుకు వెళ్లింది. మరొకరి పోటీకి హైకోర్టు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ అనివార్యంగా పోటీలో లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులుగా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నోటాకు ఓటు వేయాలని జోరుగా ప్రచారం చేస్తోంది. బీజేపీకి బుద్ధి చెప్పాలంటే నోటాకు ఓటు వేయండని గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించింది. తమ పార్టీ అభ్యర్థిని దొంగిలించిన బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ జీతూ పట్వారి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇక్కడ సేవ్ డెమోక్రసీ పేరుతో ప్రతిచోట పోస్టర్లు అంటిస్తోంది.
Advertisement
Congress
BJP
Madhya Pradesh
Lok Sabha Polls

More Telugu News