ప్రవీణ్ పై ప్రేమతో నన్ను తిట్టడం కరెక్టు కాదు: జబర్దస్త్ ఫైమా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రవీణ్ పై ప్రేమతో నన్ను తిట్టడం కరెక్టు కాదు: జబర్దస్త్ ఫైమా

Faima Interview
  • జబర్దస్థ్ తో పేరు తెచ్చుకున్న ఫైమా 
  • ప్రవీణ్ తో పెళ్లి అంటూ జరిగిన ప్రచారం
  • తమ మధ్య మనస్పర్థల గురించి ప్రస్తావన 
  • తనని నెగెటివ్ గా చూడొద్దని అభ్యర్థన

జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాప్యులారిటీ తెచ్చుకున్న నటిగా ఫైమా కనిపిస్తుంది. కామెడీని పండించడంలో ఫైమా తనదైన మార్క్ చూపించింది. తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో 'జబర్దస్త్' స్టేజ్ పై మరిన్ని నవ్వులు పూయించింది. అలాంటి ఫైమా జబర్దస్త్ ప్రవీణ్ తో లవ్ లో పడిందంటూ వార్తలు వచ్చాయి .. ఇప్పుడు విడిపోయారనే టాక్ కూడా అంతే జోరుగా నడుస్తోంది. 
 
తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ .. "మా ఇంట్లో నా పెళ్లి టాపిక్ వస్తోంది. టీవీలో కొన్ని జంటలు చాలా చనువుగా కనిపిస్తాయి. అంతమాత్రాన వాళ్ల రిలేషన్ గురించి వేరేగా ఆలోచించవలసిన అవసరం లేదు. రేటింగ్ కోసం ఇలా చేయమని ఛానల్స్ మాకు చెప్పినట్టుగా చేస్తామే తప్ప, మా మధ్య ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. అందరం కూడా ఫ్రెండ్లీగానే మా పని మేము చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటాము" అని అంది. 

ప్రవీణ్ కి .. నాకు మధ్య పర్సనల్ గా ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కొన్ని విషయాల కారణంగా మా మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. ప్రవీణ్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లి ఏదో చెబితే, అతనిపై ప్రేమతో నా గురించి నెగెటివ్ గా అనుకుంటున్నారు .. అది నాకు నచ్చలేదు. ప్రవీణ్ పై ప్రేమతో నన్ను టార్గెట్ చేసి తిట్టడం కరెంటు కాదు" అని చెప్పింది.
Advertisement
Faima
Praveen
Jabardasth

More Telugu News