RCB: గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్... చకచకా 3 వికెట్లు తీసిన ఆర్సీబీ

RCB scalps three quick against Gujarat Titans
షార్ట్స్‌లో చూడండి
ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ అదరగొట్టింది. 19 పరుగులకే 3 వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ ను ఒత్తిడిలోకి నెట్టింది. 

వృద్ధిమాన్ సాహా (1), కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (2), సాయి సుదర్శన్ (6)ల వికెట్లు కోల్పోయిన గుజరాత్ జట్టు కష్టాల్లో పడింది. సిరాజ్ 2, కామెరాన్ గ్రీన్ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం గుజరాత్ స్కోరు 6 ఓవర్లలో 3 వికెట్లకు 23 పరుగులు. షారుఖ్ ఖాన్ 8, డేవిడ్ మిల్లర్ 4 పరుగులతో ఆడుతున్నారు.
Go Back to Shorts
RCB
GT
Bengaluru
IPL 2024

More Telugu News