ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన ఇషాన్ కిషన్.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత
- నిన్న ఢిల్లీ కేపిటల్స్‌తో మ్యాచ్
- ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడిన ఆటగాడు
- నేరాన్ని అంగీకరించిన ముంబై ఓపెనర్
ఆర్టికల్ 2.2 అనేది క్రికెట్ పరికరాలు లేదంటే దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదంటే ఫిక్చర్లు, ఫిటింగ్‌ల దుర్వినియోగానికి సంబంధించినది. తనపై మోపిన అభియోగాలను ఇషాన్ అంగీకరించడంతో నిర్వాహకులు ఆ నేరం ఏంటన్న దానిని బయటపెట్టలేదు. నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ నిర్దేశించిన 258 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 247 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.