బీజేపీ ఎంపీ తేజస్విసూర్యపై కేసు నమోదు
- మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు నమోదు
- తేజస్వి సూర్యపై కేసు నమోదు చేసినట్లు ఈసీ వెల్లడి
- ఈ నెల 25న సెక్షన్ 123 (3) కింద కేసు బుక్ అయిందన్న కర్ణాటక చీఫ్ ఎలక్షన్ అధికారి
తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశామని, ఈ నెల 25న సెక్షన్ 123 (3) కింద కేసు బుక్ అయిందని కర్ణాటక చీఫ్ ఎలక్షన్ అధికారి వెల్లడించారు. తేజస్వి సూర్య మతం పేరుతో ఓట్లు అడుగుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి కేసు బుక్ చేశామని తెలిపారు.