RCB: ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ

RCB won the toss against KKR
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్బీబీ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో కోల్ కతా మొదట బ్యాటింగ్ కు దిగింది. 

ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ జోడీ 3 ఓవర్లలోనే 27 పరుగులు జోడించింది. ఫిల్ సాల్ట్ 20, నరైన్ 4 పరుగులతో ఆడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం బెంగళూరు టీమ్ లో మూడు మార్పులు జరిగాయి. సిరాజ్, కామెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కోల్ కతా టీమ్ లో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు. 

ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్క దాంట్లోనే గెలిచిన బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు లేనట్టే. ఇక ఆ జట్టు ప్రతి మ్యాచ్ గెలిస్తేనే, ఏ మూలో కొద్దిపాటి అవకాశాలు ఉంటాయి. అటు, కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 6 మ్యాచ్ ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Go Back to Shorts
RCB
Toss
KKR
Eden Gardens
Double Header
IPL 2024

More Telugu News