CSK: ఐపీఎల్: జడేజా హాఫ్ సెంచరీ, ఆఖర్లో ధోనీ మెరుపులు

CSK posts 176 runs for 6 wickets against LSG
షార్ట్స్‌లో చూడండి
బ్యాటింగ్ కు అనుకూలించని పిచ్ పై లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మోస్తరు స్కోరు సాధించింది. లక్నోలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. 

రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ సాధించడం, ఆఖర్లో ధోనీ మెరుపులు మెరిపించడం సీఎస్కే ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచాయి. జడేజా 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 57 పరుగులు చేయగా... చివర్లో బ్యాటింగ్ కు దిగిన ధోనీ కేవలం 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

మొయిన్ అలీ 20 బంతుల్లో 3 సిక్సులతో 30 పరుగులు చేశాడు. అంతకుముందు, ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ రచిన్ రవీంద్ర (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ అజింక్యా రహానే 36 పరుగులు చేశాడు. 

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, మొహిసిన్ ఖాన్ 1, యశ్ ఠాకూర్ 1, రవి బిష్ణోయ్ 1, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
CSK
LSG
Lucknow
IPL

More Telugu News