బంగారం, వెండి పానీపూరీలు.. నెట్టింట వీడియో వైరల్!
- సరికొత్త పానీపూరీలను విక్రయిస్తున్న అహ్మదాబాద్‌కు చెందిన వ్యాపారి
- గోల్డ్, సిల్వర్ పూతతో తయారు చేసిన పానీపూరీలను అమ్ముతున్న వైనం
- ఈ పానీపూరీలకు షరీట్‌గా నామకరణం
గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఈ సరికొత్త పానీపూరీలను అమ్ముతున్నాడు. గోల్డ్, సిల్వర్ పూతతో తయారు చేసిన పానీపూరీలను అతడు విక్రయించడం మనం వీడియోలో చూడొచ్చు. ఆ పానీపూరీల్లో డ్రైఫ్రూట్స్, తేనె కూడా వేయడం వీడియోలో ఉంది. వాటిని బంగారు రంగు ప్లేట్‌లోనే పెట్టి కస్టమర్లకు ఇస్తున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆ వ్యాపారి క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. కాగా, ఈ పానీపూరి పేరు షరీట్‌గా తెలుస్తోంది.