వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌లోకి వెళ్లి పోటీ చేశా... అందుకే త్యాగానికి సిద్ధపడ్డా: మధ్యప్రదేశ్ బీజేపీ నేత
- మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన రాంకిషోర్ శుక్లా
- ఆ తర్వాత బీజేపీలో చేరిన రాంకిషోర్ శుక్లా
- ఆరెస్సెస్ నేత తనను కాంగ్రెస్‌లోకి పంపించినట్లు వెల్లడి
- బీజేపీ అభ్యర్థిని బలహీనంగా ఉండటంతో తాను కాంగ్రెస్ నుంచి పోటీ చేశానని వెల్లడి
కాగా, తాను అలా చేయడానికి బీజేపీ అభ్యర్థిని ఉషాఠాకూర్ బలహీన పరిస్థితి కారణమని వ్యాఖ్యానించారు. ఆమెకు పార్టీ నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనంత్‌సింగ్ దర్బార్ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీ చేశారని గుర్తు చేశారు. ఈ రాజకీయ సమీకరణల వల్ల తాను త్యాగానికి సిద్ధమైనట్లు చెప్పారు. ఆరెస్సెస్ నేత, వీహెచ్‌పీకి చెందిన ఇండోర్ విభాగం నేత అభిషేక్ ఉదేనియా తనను కాంగ్రెస్‌లోకి పంపించినట్లు చెప్పారు.