బీజేపీలో చేరాలని ఆహ్వానం.. కాదంటే అరెస్టేనట: ఢిల్లీ మంత్రి అతిశీ సంచలన ఆరోపణలు
- ఆమ్ ఆద్మీ పార్టీని ఛిన్నాభిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోపణ
- త్వరలో తాను సహా మరో నలుగురు ఆప్ నేతల అరెస్టు
- ఇదంతా రాజకీయ ప్రతీకారమేనన్న అతిశీ
ఆమ్ ఆద్మీ పార్టీని ఛిన్నాభిన్నం చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతోందని అతిశీ మండిపడ్డారు. మరో నెల రోజుల్లో తనతో పాటు ఆప్ కీలక నేతలు నలుగురిని అరెస్టు చేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోందని అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేజ్రీవాల్ ను జైలులో పెట్టినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ బలంగానే ఉండడాన్ని బీజేపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల లోపు తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను ఈడీ ద్వారా అరెస్టు చేయిస్తారని అతిశీ చెప్పారు.