సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన సీనియ‌ర్ నేత వీహెచ్‌

Congress Senior Leader V Hanumantha Rao Meets CM Revanth Reddy
  • వీహెచ్‌ను సీఎం వ‌ద్ద‌కు తీసుకెళ్లిన ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ 
  • పార్ల‌మెంట్ టికెట్ ఆశించిన వి. హ‌నుమంత‌రావు
  • టికెట్ త‌న‌కు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో అల‌క‌బూనిన వీహెచ్‌
  • గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న‌ సీనియ‌ర్ నేత
  • వీహెచ్‌కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి హామీ
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. మ‌రో కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీహెచ్‌ పార్ల‌మెంట్ టికెట్ ఆశించారు. కానీ, టికెట్ త‌న‌కు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆయన అల‌క‌బూనారు. దీంతో గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఈ సీనియ‌ర్ నేత దూరంగా ఉంటున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల మీడియా స‌మావేశంలోనూ ఆయ‌న బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే, ఇలా పార్టీకి దూరంగా ఉంటున్న వీహెచ్‌ను మ‌హేశ్ కుమార్ గౌడ్ బుజ్జ‌గించి సీఎం వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి.. వీహెచ్‌కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.
Go Back to Shorts
V Hanumantha Rao
Congress
Revanth Reddy
Telangana

More Telugu News