బెంగళూరును రెచ్చగొట్టేలా లక్నో సూపర్ జెయింట్స్ ట్వీట్.. మండిపడుతున్న ఆర్‌సీబీ ఫ్యాన్స్!
- ఈ సీజన్‌ను ఓటమితోనే ప్రారంభించిన రెండు జట్లు
- ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీకి తొమ్మిది, ఎల్ఎస్‌జీకి 10వ స్థానం
- ఇదే విషయమై సెటైరికల్ ట్వీట్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్
ఈ సెటైరికల్ ట్వీట్‌పై బెంగళూరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రెచ్చగొట్టడం మానుకోవాలని చెబుతున్నారు. కాగా, గతేడాది విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఘర్షణతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంటోంది. ఇక మ్యాచ్ రోజు ఇరు జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు.
ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఆర్‌సీబీ, ఎల్ఎస్‌జీ రెండూ కూడా ఓటమితోనే సీజన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంకా గ్రూపు దశలో రెండు జట్లు చెరో 13 మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే, తమ తర్వాతి మ్యాచులను ఈ రెండు టీమ్స్ పంజాబ్ కింగ్స్‌తోనే తలపడనున్నాయి. నేటి (సోమవారం) మ్యాచ్‌లో పంజాబ్‌ను బెంగళూరు ఢీకొనబోతోంది. అలాగే ఈ నెల 30న లక్నో, పంజాబ్ మధ్య మ్యాచ్ ఉండనుంది.