ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక వ్యక్తి: రిమాండ్ రిపోర్టులో ఈడీ
- సౌత్ లాబీ పేరుతో లిక్కర్ కేసులో ఆమె కీలకంగా వ్యవహరించారని పేర్కొన్న ఈడీ
- ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవితనే కీలక సూత్రధారి అని వెల్లడి
- కవితకు బినామీగా రామచంద్రపిళ్లై వ్యవహరించినట్లు పేర్కొన్న ఈడీ
ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అరుణ్ పిల్ళైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటాలను పొందినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇతరులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల లంచం ఇచ్చినట్లు తెలిపింది. కవిత తన మొబైల్ ఫోన్లోని ఆధారాలను తొలగించినట్లు అందులో పేర్కొంది. సౌత్ గ్రూప్‌లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవలతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కవిత కుట్రలు పన్నినట్లు అందులో పేర్కొంది.