ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసే స్టార్లు వీరే...!
- వారం రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం
- ఓపెనింగ్ సెర్మనీకి ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్
- ఈ నెల 22వ తేదీన చెన్నైలోని చెపాక్ వేదికగా తొలి మ్యాచ్
ఇక ఈ నెల 22న ఐపీఎల్-2024 ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అలాగే 23న రెండు మ్యాచులు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడితే.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనున్నాయి.