లండన్ నుంచి స్వదేశానికి పయనమైన మహ్మద్ షమీ
- వన్డే వరల్డ్ కప్‌లో షమీకి చీలమండ గాయం
- ఇటీవలే లండన్‌లో సర్జరీ
- ఇండియాకి తిరిగి వస్తున్నట్లు విమానంలోని ఫొటోలను ట్వీట్ చేసిన షమీ
- అభిమానుల మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు తెలిపిన స్టార్ పేసర్
- సెప్టెంబర్‌లో బంగ్లాతో జరిగే సిరీస్‌లో ఆడనున్నట్ల ప్రకటన
కాగా, షమీ గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో కూడా ఆడడం లేదని ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. తిరిగి ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు షమీ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు.