నేను లోకల్.. వినోద్ నాన్ లోకల్: బండి సంజయ్

I am local and Vinod is non local says Bandi Sanjay
  • ఏపీలో ఏడు మండలాలను కలిపిందే కేసీఆర్ అన్న సంజయ్
  • నీ పార్టీలో తెలంగాణ పదమే లేదని విమర్శ
  • నువ్వు నిజాయతీపరుడివా అంటూ వినోద్ కు ప్రశ్న
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా కేసీఆర్ కు ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. ఇప్పటికీ అబద్ధాల పునాదుల పైనే బీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు. నీ పార్టీలో తెలంగాణ పదమే లేనప్పుడు... తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదని అన్నారు. ఏపీలో ఏడు మండలాలను కలిపిందే కేసీఆర్ అని... ఆఫ్ట్రాల్ ఏడు మండలాలే అని కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని దుయ్యబట్టారు.  

నువ్వు నిజాయతీపరుడివా? అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. నిజాయతీపరుడివైతే ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకుని భూములు ఎందుకు కాజేశారని అడిగారు. తాను లోకల్... వినోద్ నాన్ లోకల్ అని అన్నారు. స్మార్ట్ సిటీ కోసం తొలుత వెంకయ్య నాయుడిని కలిసింది తానేనని... అయితే, తనకు పేరు రాకుండా చేశారని విమర్శించారు.
Advertisement
Bandi Sanjay
BJP
KCR
BRS
Vinod

More Telugu News