విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
Add ap7am to your home Screen

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

Second Single from Vijay Devarakonda Family Star out now
  • విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్'
  • పరశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం
  • 'ఫ్యామిలీ స్టార్' పై భారీ అంచనాలు
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. తాజాగా ఈ చిత్రం రెండో పాట విడుదలైంది. కల్యాణి వచ్చా వచ్చా అంటూ సాగే ఈ గీతానికి గోపిసుందర్ బాణీలు కట్టగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. కార్తీక్, మంగ్లి ఆలపించారు. ఈ లిరికల్ వీడియోను చిత్రబృందం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. 

'గీతగోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో 'ఫ్యామిలీ స్టార్' పై అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Advertisement
Family Star
Second Single
Vijay Devarakonda
Mrunal Thakur
Parasuram
Dil Raju
Sirish

More Telugu News