మార్చి 15న థియేటర్లలోకి వస్తున్న 'లంబసింగి'
- భరత్ రాజ్, దివి జంటగా 'లంబసింగి.. ఏ ప్యూర్ లవ్ స్టోరీ'
- నవీన్ గాంధీ దర్శకత్వం
- పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి
- తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదల
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న లంబసింగి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో భరత్ రాజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట "నచ్చేసిందే నచ్చేసిందే…" ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా నుండి 'వయ్యారి గోదారి' సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ బాణీలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జావెద్ అలీ ఆలపించారు.
ఈ చిత్రంలో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.