రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'గేమ్ చేంజర్' నుంచి అదిరిపోయే కానుక
Add ap7am to your home Screen

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'గేమ్ చేంజర్' నుంచి అదిరిపోయే కానుక

Jaragandi song from Game Changer will be released on Ram Charan birthday
  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
  • ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు
  • జరగండి అనే పాటను విడుదల చేయనున్న చిత్రబృందం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయిక. కాగా, ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గేమ్ చేంజర్ చిత్ర బృందం అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసింది. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా గేమ్ చేంజర్ నుంచి 'జరగండి..' అనే పాటను విడుదల చేయనున్నట్టు నేడు ప్రకటించింది. ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. ఇందులో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Advertisement
Ram Charan
Jaragandi Song
Game Changer
Birthday
Shankar
Tollywood
Kollywood

More Telugu News