Junior NTR: బేగంపేట ఎయిర్ పోర్టులో కలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీడియో వైరల్

Jr NTR and Ramcharan spotted together at Begumpet airport yesterday
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సొంత అన్నదమ్ముల్లా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వీరి అనుబంధం మరింత బలపడింది. తాజాగా వీద్దరూ హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఇదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంట్లో జరుగుతున్న ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొనేందుకు తారక్ కూడా ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయల్దేరారు.

 ఇద్దరూ ఒకే సమయంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడంతో అక్కడున్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్, చరణ్ ఇద్దరూ చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో... ఇరువురి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Go Back to Shorts
Junior NTR
Ramcharan
Tollywood

More Telugu News