కేసీఆర్‌కు షాక్... బీఆర్ఎస్‌కు జహీరాబాద్ ఎంపీ పాటిల్ రాజీనామా... బీజేపీలో చేరిక

BRS MP BB Patil resigns from BRS
  • పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించిన బీబీ పాటిల్
  • పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
  • సాయంత్రం నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం
బీఆర్ఎస్ పార్టీకి మరో ఎంపీ షాకిచ్చారు. నిన్న నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరగా... ఈ రోజు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ హామీతోనే ఆయన బీజేపీలో చేరినట్లుగా తెలుస్తోంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనకు జహీరాబాద్ నుంచి రెండుసార్లు అవకాశం కల్పించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా లేఖను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బీబీ పాటిల్ 2014లో, 2019లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు.
Advertisement
BRS
BJP
Lok Sabha Polls

More Telugu News