నీట మునిగిన ద్వారకా నగరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
- ద్వారక వద్ద అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని సముద్రంలోకి దిగిన వైనం
- ద్వారకాధీశ్ ఆలయంలో పూజలు
"అగాధ జలాల్లో మునిగి ఉన్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్లడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. ప్రాచీన కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తిభావానికి నేను అనుసంధానించబడ్డానన్న భావన కలిగింది. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించుగాక" అంటూ మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు తన పర్యటన ఫొటోలను కూడా పంచుకున్నారు.



