రాంచీ టెస్టుకు బుమ్రా దూరం.. ఆ స్థానాన్ని భర్తీచేసే బౌలర్ అతడేనా?
- ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బుమ్రాకు రెస్ట్
- ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు తిరిగి అందుబాటులోకి
- 20 రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్న వైస్ కెప్టెన్
- బుమ్రా స్థానంలో ముకేశ్ కుమార్?
ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరగనున్న చివరి టెస్టుకు మాత్రం బుమ్రా అందుబాటులో ఉంటాడు. అప్పటి వరకు అంటే దాదాపు 20 రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. రాంచీ టెస్టులో కనుక ఇంగ్లండ్ విజయం సాధిస్తే అప్పుడు ధర్మశాల టెస్టు కీలకంగా మారుతుంది. బుమ్రా ఈ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలోను కలిపి 80కిపైగా ఓవర్లు వేశాడు. బుమ్రా స్థానంలో ముకేశ్ కుమార్ కానీ, పిచ్ అనుకూలతను బట్టి నాలుగో స్పిన్నర్‌ను కానీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
మూడో టెస్టుకు ముందు రంజీ ట్రోఫీ కోసం ముకేశ్ కుమార్‌ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ముకేశ్ కుమార్ బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.