Buddha Venkanna: చంద్రబాబు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం.. వీడియో ఇదిగో!

Buddha Venkanna Press Meet In Vijayawada
  • చంద్రబాబు తనకు దేవుడితో సమానమన్న టీడీపీ నేత
  • తన చివరి రక్తపుబొట్టును ఆయన కోసమే ధారబోస్తానని వెల్లడి
  • పార్లమెంట్ టికెట్ ఇవ్వాలంటూ మీడియా ముఖంగా విజ్ఞప్తి

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తనకు దేవుడితో సమానమని పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకూ ఆయనకు విధేయుడిగా ఉంటానని పేర్కొన్నారు. తన రక్తంలోని చివరి బొట్టు వరకూ ఆయనకే ధారబోస్తానని చెప్పుకొచ్చారు. ఇది నిరూపించుకోవడానికి ఆదివారం చంద్రబాబు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం చేశారు. తన శరీరంలో నుంచి రక్తం తీసి చంద్రబాబు కటౌట్ పాదాలకు అభిషేకం చేయడంతో పాటు గోడపై సీబీఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే.. అంటూ నినాదం రాశారు. అనంతరం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు దేవుడని, ప్రాణం ఉన్నంత వరకూ ఆయనకు విధేయుడిగా ఉంటానని చెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశానని చెప్పారు. అనకాపల్లి పార్టీ టికెట్ విషయంలో ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయని, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం విషయంలో ఎవరి పేర్లూ వినిపించడంలేదన్నారు. రాష్ట్రంలో, దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడబోతున్నాయని, కీలకమైన విశ్వాసపాత్రులైన వారికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానానికి ఆయన సూచించారు. చివరగా.. తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ‘జై చంద్రబాబు’ అనే అంటానని, చంద్రబాబుపై ఎవరు విమర్శలు చేసినా ఊరుకోబోనని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News