Ram Charan: బుచ్చిబాబు సినిమా కోసం .. చరణ్ జోడీగా జాన్వీ కపూర్!

Ram Charan and Buchibabu Movie Update
షార్ట్స్‌లో చూడండి
చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో .. పాన్ ఇండియా సినిమా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే, ఆ తరువాత ప్రాజెక్టును చరణ్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడు. 

చరణ్ కెరియర్ లో ఇది 16వ సినిమా. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని పాత్రలకి సంబంధించి,  విజయనగరం .. విశాఖపట్నం .. శ్రీకాకుళం .. సాలూరు ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ చాలా కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు. 

ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంపై కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం ఆమెను ఎంపిక చేయడం ఆల్రెడీ జరిగిపోయిందని అంటున్నారు. ఈ జోడీ పట్ల ఆడియన్స్ ఉత్సాహంగా ఉన్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Go Back to Shorts
Ram Charan
Buchibabu
Jahnvai Kapoor

More Telugu News