హైదరాబాద్‌లో దారుణం.. బీజేపీ ఎంపీ టికెట్ ఆశావహుడి దారుణహత్య

BJP leader killed in Hyderabad Yousufguda
  • గతరాత్రి యూసుఫ్‌గూడలో ఘటన
  • రామన్నపై దాడిచేసి హత్యచేసిన 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన రామన్న
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ నేత సింగోటం రామన్న హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడిచేసి హత్యచేశారు. 

ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రామన్న చేపలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే రామన్న గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. హత్యకు పాతకక్షలు, రాజకీయ కారణాల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Crime News
BJP
Hyderabad
Yousufguda

More Telugu News