వివాహబంధానికి ముగింపు పలికిన నటి హేమమాలిని కుమార్తె

Esha Deol And Bharat Takhtani Announce Separation
  • తన మాజీ భర్త భరత్ తఖ్తానీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల
  • పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్టు వెల్లడి
  • ప్రస్తుతం తమ బిడ్డల భవిష్యత్తే ముఖ్యమని స్పష్టీకరణ
  • ఈ క్లిష్ట సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలంటూ విజ్ఞప్తి
ప్రముఖ నటి, హేమామాలిని కుమార్తె ఈషా డియోల్ తన వివాహబంధానికి ముగింపు పలికారు. తన భర్త భరత్ తఖ్తానీతో 11 ఏళ్ల బంధానికి ముగింపు పలికినట్టు తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ సంయుక్తంగా సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తమ పిల్లల భవిష్యత్తే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కూడా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 

నటి హేమమాలిని, ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ 2002లో ‘కోయి మేరే దిల్ సే పూఛే’ మూవీతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టారు. ఆ తరువాత పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ తరువాత నటన నుంచి విరామం తీసుకున్న ఆమె 2012లో భరత్ తఖ్తానీని అనే వ్యాపారవేత్తను వివాహమాడారు. వారికి మిరాయా, రాధ్యా అనే కూతుళ్లు ఉన్నారు. వివాహం, పిల్లల కారణంగా కొంత కాలం నటన నుంచి బ్రేక్ తీసుకున్న ఆమె.. ‘కేక్‌వాక్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మళ్లీ తెరంగేట్రం చేశారు.
Go Back to Shorts
Esha Deol Divorce
Hema Malini
Dharmendra
Bollywood

More Telugu News