కళ్లు ఆర్పుతూ, చిరునవ్వులు రువ్విన బాల రాముడి విగ్రహం.. అంతా ఏఐ మహాత్మ్యం.. వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

కళ్లు ఆర్పుతూ, చిరునవ్వులు రువ్విన బాల రాముడి విగ్రహం.. అంతా ఏఐ మహాత్మ్యం.. వీడియో ఇదిగో!

AI video of Ram Lalla goes viral
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఏఐ వీడియో
  • అద్భుతంగా ఉందంటూ మెచ్చుకుంటున్న నెటిజన్లు
  • అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తి
అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి సోమవారం ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వేద పండితులు ఈ క్రతువును నిర్వహించారు. కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారంలో ఈ వేడుకను వీక్షించారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాల రాముడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. తాజాగా ఈ విగ్రహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో గుర్తుతెలియని వ్యక్తులు బాల రాముడి విగ్రహానికి కదలికలు జోడించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో బాల రాముడి విగ్రహం కళ్లు ఆర్పుతూ, అటూఇటు చూస్తూ, చిరునవ్వులు రువ్వడం కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై రామ భక్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోను అప్ లోడ్ చేసిన వ్యక్తిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
Ram Lalla Video
AI Video
Viral Videos
Social Media
Ayodhya

More Telugu News