కుటుంబ సభ్యులతో కలిసి స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన కేశినేని నాని

Vijayawada MP Kesineni Nani Visits Golden Temple
  • ఎక్స్‌లో ఫొటో షేర్ చేసిన నాని
  • అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించానన్న వైసీపీ నేత 
  • ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన నాని
ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని నిన్న అమృత్‌సర్‌లోని పవిత్ర సిక్కు ఆలయం గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించారు. స్వర్ణ దేవాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసిన నాని.. గత సాయంత్రం ఆలయాన్ని సందర్శించి అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేసినట్టు తెలిపారు. 

గత కొంతకాలంగా టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నాని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా బాబు మోసం చేస్తారని, తన కొడుకు లోకేశ్‌ను సీఎం చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.
Advertisement
Kesineni Nani
Amritsar
Golden Temple
YSRCP

More Telugu News