అయోధ్య వేడుకపై తప్పుడు సమాచారం వ్యాప్తి పట్ల కేంద్రం అప్రమత్తత!
- సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిపై కేంద్రం అలర్ట్
- తప్పుడు లేదా మోసపూరిత సమాచారం రాకుండా చూడాలని ఆదేశాలు
- మీడియా సంస్థలకు, సోషల్ మీడియా మాధ్యమాలకు కేంద్రం ఆదేశాలు
అయోధ్య రామమందిరలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో... ధ్రువీకరించని లేదా రెచ్చగొట్టే లేదా నకిలీ సందేశాలు వ్యాప్తి చెందుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలా ఎక్కువగా జరుగుతోందని, ఇలాంటి వ్యవహారం శాంతిభద్రతలకు, మతసామరస్యానికి విఘాతం కలిగిస్తుందని తెలిపింది. ఇలాంటి తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని ప్రచురించకుండా... ప్రసారం చేయకుండా వార్తాపత్రికలు, ప్రయివేటు శాటిలైట్ టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలు సంబంధిత కంటెంట్‌ను కట్టడి చేయాలని ఆదేశించింది.