ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్... లీగ్ చరిత్రలోనే అత్యధిక బిడ్డింగ్
- ఐపీఎల్ కు ఐదేళ్ల పాటు స్పాన్సర్ గా వ్యవహరించనున్న టాటా గ్రూప్
- 2024 సీజన్ నుంచి 2028 సీజన్ వరకు ఒప్పందం
- రికార్డు స్థాయిలో రూ.2,500 కోట్లతో హక్కుల కైవసం
- గతంలోనూ ఐపీఎల్ స్పాన్సర్ గా వ్యవహరించిన టాటా
టాటా గ్రూప్ గతంలోనూ ఐపీఎల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. 2022, 2023 సీజన్లకు టాటా గ్రూపే ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్. అంతేకాదు, ప్రపంచ క్రికెట్లో అతి పెద్ద మహిళల టీ20 లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు టైటిల్ స్పాన్సర్ కూడా ఈ దేశీయ దిగ్గజ సంస్థే.