addanki dayakar: కాంగ్రెస్ పట్ల మీ ప్రేమను హర్షిస్తున్నాను.... కానీ...!: బండి సంజయ్‌కి అద్దంకి దయాకర్ కౌంటర్

Addanki Dayakar counter to Bandi Sanjay
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పట్ల మీకు ఉన్న ప్రేమను హర్షిస్తున్నప్పటికీ... మీ మాటల్లో బీఆర్ఎస్‌తో మీ అనైతిక రాజకీయం కనిపిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ చురక అంటించారు. సోమవారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. 

తెలంగాణలో తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ఏ పార్టీ అయినా ప్రజలు వారిని నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసినా... ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం తీసుకు రావాలని భావించినా ప్రజలు సహించరన్నారు. మిత్రుడు బండి సంజయ్ తమపై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే తమను ఏదో అలర్ట్ చేసినట్లుగా కనిపిస్తున్నప్పటికీ... అటువైపు నుంచి బీజేపీ-బీఆర్ఎస్ మైత్రి కనిపిస్తోందన్నారు.

బండి సంజయ్ ప్రకటన చూసినవారికి... కాంగ్రెస్, బీఆర్ఎస్ మిలాఖత్ రాజకీయాలు చేస్తోన్నట్లుగా... అలాగే కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ వారే బీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితి ఉంటే మా పార్టీ వద్ద అంతకుమించి ప్రణాళికలు ఉన్నాయన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని... కాబట్టి వారే కాపాడుకుంటారన్నారు.
Go Back to Shorts
addanki dayakar
Telangana
Bandi Sanjay
Congress
BJP

More Telugu News