ఆ మసీదులను ఖాళీ చేయకుంటే..!: కర్ణాటక బీజేపీ నేత హెచ్చరిక

Karnataka BJP leader KS Eshwarappa warns muslimis to vacate Masjids
  • ఆలయాలను ధ్వంసం చేసి కట్టిన మసీదులను ఖాళీ చేయాలని మాజీమంత్రి ఈశ్వరప్ప హెచ్చరిక
  • లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న బీజేపీ నేత
  • ఆలయాలను ధ్వంసం చేసి కట్టిన ఏ ఒక్క మసీదును వదిలిపెట్టబోమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆలయాలను కూల్చి కట్టిన మసీదులను వెంటనే ఖాళీ చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప ముస్లింలకు హెచ్చరికలు జారీ చేశారు. బెళగావిలో నిన్న హిందూ కార్యకర్తల కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మథుర సహా మరో స్థలం తమ పరిశీలనలో ఉందన్న ఆయన.. ఈ రోజో, రేపు కోర్టు తీర్పు వస్తుందని, ఆ వెంటనే అక్కడ ఆలయాలు నిర్మిస్తామని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని అన్నారు. 

ముస్లింలు స్వచ్ఛందంగా ఆ మసీదులను ఖాళీ చేయకుంటే ఏమవుతుందో? ఎంతమంది చనిపోతారో తమకు తెలియదని ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది డిసెంబరులో ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను ధ్వంసం చేసి కట్టిన ఏ ఒక్క మసీదును వదిలిపెట్టబోమని హెచ్చరించి వార్తల్లో నిలిచారు. ఇండియా హిందూ దేశంగా మారుతుందని ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నట్టు పేర్కొన్నారు.
Advertisement
KS Eshwarappa
Mosque
Karnataka
BJP

More Telugu News