దావూద్ ఇబ్రహీం ప్లాట్ లో సనాతన ధర్మ పాఠశాల
- అండర్ వరల్డ్ డాన్ ప్లాట్ ను వేలంలో సొంతం చేసుకున్న లాయర్
- రూ.15 వేలు కనీస ధరగా నిర్ణయించిన ప్లాట్ కు రూ. 2 కోట్లు
- మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో దావూద్ పూర్వీకుల ఆస్తుల వేలం
పలు క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో దావూద్ కు చెందిన వివిధ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ముంబాకే లోని నాలుగు ఆస్తులను 2020లో వేలం వేసింది. ఇందులో పాల్గొన్న ఓ లాయర్.. రూ.2.01 కోట్లు వెచ్చించి వాటిని సొంతం చేసుకున్నాడు. దావూద్ ఇబ్రహీంకు చెందిన ప్లాట్ ను సొంతం చేసుకున్న లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ ప్లాట్ ను పునరుద్ధరించి సనాతన ధర్మ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, దావూద్ ఆస్తులను సొంతం చేసుకున్న లాయర్ ఎవరనే వివరాలు మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. ఢిల్లీకి చెందిన లాయర్ అని వేలంలో పాల్గొన్న వారు చెప్పినట్లు సమాచారం.