మంచుగా మారిన మరుగుతున్న వేడి నీళ్లు.. ఫిన్‌లాండ్‌లో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
- శీతకాలం కావడంతో రికార్డు కనిష్ఠ స్థాయికి దిగజారిన ఉష్ణోగ్రతలు
- ఓ ఔత్సాహిక పర్యాటకుడు చేసిన ప్రయోగంలో మంచు మేఘంగా మారిన వేడి నీళ్లు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలలో చూసిన ట్రిక్‌ను ఇక్కడ ప్రదర్శించానని లారీ ఉంటామో పేర్కొన్నాడు. వేడి నీరు మంచుగా మారిపోవడం సాధ్యమేనని, అయితే మైనస్ 30 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రయోగాలకు అనువు కాదన్నాడు. తన క్యాబిన్‌లో నీళ్లు మరిగించి వెంటనే బయటకు తీసుకొచ్చి గాల్లోకి అర్ధ చంద్రాకారంలో విసిరానని, వెంటనే మంచుతో నిండిన మేఘం ఏర్పడిందని చెప్పాడు. కాగా ఉత్తర యూరప్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లారీ ఉంటామో పర్యటించిన ప్రాంతంలోని ఎనోంటెకియో గత 25 సంవత్సరాలలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 44.3 సెల్సియస్ డిగ్రీలు (-47.74°ఫారెన్‌హిట్) శుక్రవారం నమోదయింది.