ఆర్టీసీ బస్సులో జుట్టుపట్టుకుని... పిడిగుద్దులతో కొట్టుకున్న మహిళలు... ఇదిగో వీడియో
Advertisement

ఆర్టీసీ బస్సులో జుట్టుపట్టుకుని... పిడిగుద్దులతో కొట్టుకున్న మహిళలు... ఇదిగో వీడియో

Women fight for seat in free bus
  • జహీరాబాద్ నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు
  • కిక్కిరిసిపోయిన ఆర్టీసీ బస్సు  
  • సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ గతంలో కంటే బాగా పెరిగింది. ఈ క్రమంలో పలుచోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. తాజాగా జహీరాబాద్ నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు, నలుగురు మహిళలు సీట్ల కోసం దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహిళలు తిట్టుకోవడం... జుట్టు పట్టుకొని మరీ కొట్టుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న బస్సులో చాలామంది జనం ఎక్కారు. కొంతమందికి కూర్చోవడానికి సీటు దొరకని పరిస్థితి. ఈ క్రమంలో సీటు కోసం మహిళలు పోటీ పడ్డారు. కొంతమంది కర్చీఫ్ వేసుకోగా.. మరికొంతమంది కిటికీ నుంచి బస్సులోకి ఎక్కారు. ఈ క్రమంలో ముగ్గురు నలుగురు మహిళలు కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించారు.
Advertisement
Telangana
bus
Congress
Sangareddy District

More Telugu News