రాహుల్ గాంధీ మరో యాత్ర.. 'భారత్ న్యాయ్ యాత్ర' పేరుతో మణిపూర్ టు ముంబై
- జనవరి 14న మణిపూర్ లో ప్రారంభించనున్న కాంగ్రెస్ మాజీ చీఫ్
- 14 రాష్ట్రాలు, 85 జిల్లాల గుండా కొనసాగి మార్చి 20 న ముంబైలో ముగింపు
- బస్సులో యాత్ర కొనసాగించనున్న రాహుల్ గాంధీ
ఈ యాత్రలో భాగంగా మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను రాహుల్ గాంధీ కవర్ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారని కాంగ్రెస్ పేర్కొంది. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనలపై పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించి ఈ యాత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ యాత్రలో సుమారు 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపడతారని వివరించింది.