బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కేసులో మరో ముగ్గురి అరెస్టు

3 more arrested in Bigg Boss winner Pallavi Prashanth case
  • అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల వాహనాలపై దాడి కేసు
  • ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • రెండు రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన కేసులో మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూసుఫ్ గూడకు చెందిన సుధాకర్, పవన్, సరూర్ నగర్ కు చెందిన అవినాశ్ రెడ్డి అనే విద్యార్థిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జరిగిన ధ్వంసం, దాడికి సంబంధించిన ఘటనలో రెండు కేసులు నమోదు కాగా... ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మరోవైపు, పల్లవి ప్రశాంత్ కు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని సూచించింది. బెయిల్ పై బయట ఉన్న ప్రశాంత్ ప్రస్తుతం తన ఊరిలో ఉన్నాడు.
Advertisement
Pallavi Prashanth
Bigg Boss

More Telugu News