'గోకుల్ చాట్' యజమాని ముకుంద్ దాస్ మృతి
- కోఠిలో 1996లో ప్రారంభమైన గోకుల్ చాట్ భాండార్
- 2007 ఆగస్టు 25న జరిగిన బాంబు పేలుడులో 33 మంది మృతి
- చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూసిన ముకుంద్ దాస్
తాజాగా, గోకుల్ చాట్ పేరు మరోమారు వార్తల్లోకి ఎక్కింది. దాని యజమాని ముకుంద్ దాస్ నిన్న మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోకుల్ చాట్‌ను ఆయన 1996లో ప్రారంభించారు.