మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అధికారులతో తొలిసారి సమావేశమైన సీతక్క.. వీడియో ఇదిగో
- ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశాలు నిర్వహించిన మంత్రి
- మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి గిరిజన శాఖ అధికారులతో కూడా భేటీ
- ఎక్స్ వేదికగా సమావేశాల వీడియోను పంచుకున్న సీతక్క
పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశాలు నిర్వహించారు. మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి గిరిజన శాఖతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. సమావేశానికి విచ్చేసిన మంత్రి సీతక్కను అధికారులు సాదరంగా ఆహ్వానించడం వీడియోలో కనిపించింది. పుష్పగుచ్ఛాలు ఇచ్చి పరిచయం చేసుకున్నారు.