'హాయ్ నాన్న'లో శ్రుతి హాసన్ పాత్రపై స్పందించిన డైరెక్టర్!
Add ap7am to your home Screen

'హాయ్ నాన్న'లో శ్రుతి హాసన్ పాత్రపై స్పందించిన డైరెక్టర్!

Shouryuv Interview
  • ఈ నెల 7న 'హాయ్ నాన్న' విడుదల 
  • దర్శకుడిగా శౌర్యువ్ పరిచయం 
  • కథానాయికగా మృణాళ్ ఠాకూర్ 
  • శ్రుతి హాసన్ పాత్ర విషయంలో సస్పెన్స్  

నాని హీరోగా ప్రేక్షకుల ముందుకురావడానికి 'హాయ్ నాన్న' సినిమా రెడీ అవుతోంది. వైరా బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ పరిచయమవుతున్నాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఇక నాని కూతురు పాత్రలో బేబీ కియారా కనిపించనుంది. 

ఈ నెల 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. నాని.. మృణాళ్ .. బేబీ కియారా ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారుగానీ, శ్రుతి హాసన్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు శౌర్యువ్ ఈ విషయంపై స్పందించాడు. 

" ఈ సినిమాలో శ్రుతి హాసన్ పాత్ర ఫస్టాఫ్ లోను .. సెకండాఫ్ లోను ఉంటుంది. ఫస్టాఫ్ లో ఆడియన్స్ కి ఆమె పాత్రకి సంబంధించిన క్లారిటీ రాదు. సెకండాఫ్ ఆమె పాత్ర విషయంలో వాళ్లకి ఒక స్పష్టత వస్తుంది. సెకండాఫ్ లోనే ఆమె సాంగ్ కూడా ఉంటుంది" అంటూ ఆమె పాత్రకి సంబంధించిన విషయాలను సస్పెన్స్ లో పెట్టాడు. 
Advertisement
Hi Nanna
Nani
Mrunal Thakur
Sruthi Hassan

More Telugu News