'అఖండ 2' కథపై బోయపాటి కసరత్తు!
- సంచలన విజయాన్ని అందుకున్న 'అఖండ'
- సీక్వెల్ ఉంటుందని గతంలోనే చెప్పిన బోయపాటి
- అందుకు సంబంధించి జరుగుతున్న సన్నాహాలు
- మరో వైపున లైన్లోనే ఉన్న బన్నీ ప్రాజెక్టు
ఆ సినిమా తరువాత బోయపాటి చేసిన 'స్కంద' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందువలన ఆయన 'అఖండ 2'కి సంబంధించిన కథను రెడీ చేసుకుంటున్నాడని అంటున్నారు. 'అఖండ'లోని పాయింటును పట్టుకునే సీక్వెల్ కూడా ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని గతంలోనే బోయపాటి చెప్పాడు.
ఇక ప్రస్తుతం బాలయ్య .. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాతనే ఆయన బోయపాటి ప్రాజెక్టుపైకి వెళ్లవలసి ఉంటుంది. 'అఖండ 2' అనుకున్న సమయానికి మొదలెట్టలేకపోతే, ఆల్రెడీ బన్నీతో ఓకే అనిపించుకున్న కథ రెడీగానే ఉందిగనుక, ఆయనతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూడా బోయపాటి ఉన్నాడని అంటున్నారు.