Hi Nanna: నేను ఎప్పుడూ ఏ డైరెక్టర్ తో ఆ మాట అనలేదు: హీరో నాని

Nani Interview
షార్ట్స్‌లో చూడండి
నాని హీరోగా రూపొందిన 'హాయ్ నాన్న' సినిమా ఈ నెల 7వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మోహన్ చెరుకూరి - విజేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, శ్రుతి హాసన్ .. మృణాల్ ఠాకూర్ ... బేబీ కియారా ముఖ్యమైన పాత్రలను పోషించారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నాడు.

తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. "ఈ సినిమా సున్నితమైన భావోద్వేగాలతో కొనసాగుతుంది. అక్కడక్కడ హాయిగా నవ్వుకోవచ్చు కూడా. నేను కొత్త దర్శకులతోనే చేస్తున్నానని అంటున్నారు. నాకు నచ్చిన కథలను వాళ్లు తీసుకొస్తుండటం వలన అలా జరుగుతోంది అంతే. ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ  లేదు" అన్నాడు. 

" నాకు చాలామంది స్టార్ డైరెక్టర్స్ తెలుసు. వాళ్లంతా నాతో ఎంతో అభిమానంగా ఉంటారు. అయినా ఏ రోజు కూడా 'మనం కలిసి ఒక సినిమా చేయాలి సార్' అని నేను ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే నాకు రాసిపెట్టిన కథ నా దగ్గరికి వస్తుంది. ఒక కథ తన హీరోను తనే వెతుక్కుంటుంది .. ఒక సినిమా తన రిలీజ్ డేట్ ను తానే సెట్ చేసుకుంటుందనేది నా ఉద్దేశం" అని చెప్పాడు.
Go Back to Shorts
Hi Nanna
Nani
Sruthi Hassan
Mrunal Thakur

More Telugu News