స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు.. ఈరోజు కూడా లాభాలే

Markets ends in profits
  • రాణించిన దిగ్గజ కంపెనీలు
  • 493 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 135 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. దిగ్గజ కంపెనీలు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 493 పాయింట్లు లాభపడి 67,481కి చేరుకుంది. నిఫ్టీ 135 పాయింట్లు ఎగబాకి 20,268 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (3.28%), ఎన్టీపీసీ (2.97%), యాక్సిస్ బ్యాంక్ (2.71%), ఎల్ అండ్ టీ (2.52%), బజాజ్ ఫైనాన్స్ (1.84%). 

టాప్ లూజర్స్:
విప్రో (-1.34%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.27%), మారుతి (-0.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.35%), టెక్ మహీంద్రా (-0.29%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News